
అన్ని హంగులు పూర్తి చేసుకొని జులై 15న విడులవుతుంది అనుకున్న రజినీకాంత్ కబాలి, మరోసారి వాయిదా పడింది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు చాలా వరకు మిగిలి ఉండడంతో, విడుదల తేదీని అందుకోలేకపోతున్నట్లు సమాచారం. దానికి తోడు ఇంత బాగా వచ్చిన సినిమాని, కేవలం రిలీజ్ డేట్ దృష్టిలో ఉంచుకొని తొందర పడి పనిచేయొద్దని, రజినీ కూడా చెప్పడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకొని, విడుదల వాయిదా వేసింది. ఆగస్ట్ మొదటి వారంలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని అంచనా.
టీజర్ కి ముందు పెద్దగా అంచనాలు లేని కబాలి, టీజర్ రిలీజ్ తర్వాత, అభిమానుల్లో పెద్ద సందడి రేపింది. బాషాని మించిన స్థాయిలో, రజిని ఇందులో డాన్ గా అదరగొడతాడని అందరూ అనుకుంటున్నారు. పీఏ రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని కలైపులి ఎస్ థాను, వీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సూపర్ స్టార్ పక్కన తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది.