
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు మహా అయితే ఓ పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వెలిగిపోయి ఆ తరువాత కనిపించకుండా పోతున్నారు. ఈ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కేవలం అతికొద్ది మంది మాత్రమే తమ గ్లామర్‌తో పాటు, స్టార్‌డమ్ కూడా తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకుంటే అనుష్క, త్రిష, నయనతార, శ్రియ లాంటి వారు ముందుంటారు. అయితే వీరందరిలోకెళ్లా టాప్ ప్లేస్ సంపాదించుకుంది ఒక్క శ్రియ. అదేంటి శ్రియకు ప్రస్తుతం సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడం లేదుగా.. మరి టాప్ ప్లేస్ ఎలా సంపాదించింది? అంటే దానికి సమాధానం ఎలా ఉంటుందో చూద్దాం పదండి. 
ప్రస్తుతం అగ్ర హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న శ్రియ, ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్‌కు రెమ్యునరేషన్ విషయంలో సవాల్ విసురుతుంది. కేవలం సినిమాలే కాకుండా యాడ్స్, ఈవెంట్స్‌లో ఎక్కువగా కనిపించే శ్రియ అందుకు తగ్గట్టుగానే భారీ మొత్తం తీసుకుంటున్నట్లు సమాచారం. ఏడాదికి కనీసం మూడు సినిమాల్లో కనిపిస్తూనే.. అటు బాలీవుడ్‌లో సైతం ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది ఈ బ్యూటీ. ఎలాంటి కార్యక్రమం జరిగినా అవార్డు వేడుకలు జరిగినా, ఆఖరికి ఫ్యాషన్ షో జరిగిన అక్కడ శ్రియ ప్రత్యక్షమవుతోంది. ఇలా ప్రతి విషయంలోనూ తన సంపాదన పెంచుకుంటూ ఇప్పటికీ తానే నెంబర్ వన్ అంటుంది శ్రియ. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ కనీసం శ్రియ సంపాదనలో సగం కూడా సంపాదించలేకపోవడం గమనర్హం.