మెగా డైరెక్టర్‌కే ఓటేసిన స్టైలిష్ స్టార్

సరైనోడుతో బంపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ చేశాడు. ఇప్పటికే బన్నీతో సినిమా చేయడానికి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ క్యూ కట్టిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి బన్నీతో ఓ ద్విభాషా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాపై టాలీవుడ్‌లో అనేక వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. తమిళ్ స్టార్ హీరో సూర్యతో 24 అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు విక్రమ్ కుమార్. అయితే ఈ డైరెక్టర్, నితిన్‌తో ఓ సినిమా ముందే కమిట్ అవ్వడం వలన, బన్నీతో సినిమా చేయలేకపోయాడు. ఈ గ్యాప్ లో  బన్నీతో సినిమా సై అన్న మరో డైరెక్టర్ హరీష్ శంకర్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్, ఆ తరువాత మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు బన్నీతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన ఈ మెగా డైరెక్టర్, బన్నీ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఇక ఈ కథ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పాడట. మరి వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఏ జోనర్‌కు చెంది ఉంటుందా అని ఆలోచిస్తున్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. ఏదేమైనా సరైనోడు సక్సెస్‌తో తన స్టామినా ఏమిటో చూపించిన అల్లు అర్జున్, తన స్థాయికి తగ్గ కథను ఎంచుకునే ఉంటాడు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.