ఆ హీరోయిన్ కావాలంటున్న ఎన్టీఆర్!

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయిన హీరోయిన్ నివేదా థామస్. నాని హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ జెంటిల్‌మేన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నివేద, తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్‌ను ఒక్కసారిగా ఆమె వైపు తిప్పుకుంది. సినిమాలో నివేదా పర్ఫార్మెన్స్‌కు చాలా మంది స్టార్స్ కూడా ఇంప్రెస్ అయ్యారంటే.. ఈ గుమ్మ ఇక టాలీవుడ్‌లో పాగా వేయడానికి రెడీ అయ్యిందనే చెప్పొచ్చు. నటన పరంగా ఫుల్ మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీని, ఓ స్టార్ హీరో తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా తీసుకుందామని రికమెండ్ చేయడం ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్లాల్సిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్‌లో యమ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ మధ్యే నాని జెంటిల్‌మేన్ సినిమా చూశాడు. సినిమాలో నివేదా నటనకు ఎన్టీఆర్ ఫిదా అయినట్లు సమాచారం. ఆమె నటన తనకెంతగా నచ్చిందంటే.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోమని దర్శకుడు వక్కంతం వంశీకి తెలిపాడట. ఎన్టీఆర్ వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా... ఒక హీరోయిన్‌గా నివేదా థామస్‌ను తీసుకోమని సూచించాడు ఎన్టీఆర్. అంటే.. నివేదా థామస్ యాక్టింగ్‌కు కామన్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా ఫిదా అయ్యారంటే అమ్మడికి ఇక టాలీవుడ్‌లో ఢోకా లేదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఏదేమైనా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు ఫిలింనగర్ వర్గాలు.

ఇక తెలుగు సినిమాల్లో ఈ మధ్య అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. స్టార్ హీరోలందరూ కూడా కొత్త తరహా కథల వైపు చూస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నారు. అలాగే హీరోయిన్ల పాత్రలకు సినిమాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్ ప్రెస్ రాజా,  ఊపిరి, అఆ లాంటి సినిమాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యమే దక్కింది. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘జెంటిల్ మన్’లో హీరోయిన్లిద్దరికీ మంచి ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నివేదా థామస్ పోషించిన కేథరిన్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆమె నటన కూడా అందరినీ మెప్పించింది. తెలుగులో హీరోయిన్ పాత్రకు ఇంత ప్రాధాన్యం ఉండటం, ఆ పాత్రలో హీరోయిన్ అంత బాగా రాణించడం అరుదైన విషయం.

నివేదా స్వతహాగా మలయాళ అమ్మాయి కాబట్టి.. ఆమెను హీరోయిన్ గా పెట్టుకుంటే మలయాళంలోనూ తన సినిమాకు కలిసొస్తుందని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడట. ‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్, నిత్యామీనన్ లాంటి మల్లూవుడ్ ప్రముఖులు నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బాగా ఆడితే ఎన్టీఆర్ కు కేరళలో మంచి ఫాలోయింగ్ వచ్చే అవకాశముంది. అలాగే తన తర్వాతి సినిమాకు కూడా మల్లూవుడ్ జనాల్ని ఆకర్షించే ప్లాన్లో ఉన్నాడన్నమాట ఎన్టీఆర్.