సంబంధిత వార్తలు

పద్మశ్రీ అవార్డ్ సాధించడం ఆయా రంగాల్లో ఉండి పనిచేసేవారికి ఒక కల. కాని అలాంటి కలలేవి తనకి అస్సలు లేవని, సీనియర్ నటులు తనిఖెళ్ళభరణి అన్నారు. ఇందుకు కారణం వివరిస్తూ, ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం గారి లాంటి మహా నటులకే ఆ అవార్డు రానప్పుడు తనకి రాదని, ఒకవేళ వచ్చిన తాను మాత్రం తీసుకోబోనని భరణి ఖరాఖండిగా చెబుతున్నారు.
రైటర్ గా, నటుడిగా, ఆ తరం హీరోలతో పాటు, ఇప్పుడు కొత్త తరం హీరోలతో కూడా నటిస్తూ వివాదాలకు దూరంగా ఉండే భరణి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల, సినీ ఇండస్ట్రీ పెద్దలు విస్తుపోతున్నారు.