
జెంటిల్ మ్యాన్ సినిమా రిలీజ్ ఐన దగ్గరి నుండి హీరో నాని కంటే, సినిమా కథ కంటే కూడా, హీరోయిన్ నివేద పైనే అందరి కళ్ళు. కథ మొత్తం తన చుట్టే తిరగడం వల్ల, నటన కి బాగా స్కోప్ దొరికింది. ఆ అవకాశాన్ని నివేద సరిగ్గా ఉపయోగపరుచుకుంది. పవర్ ఫుల్ రోల్ లో, కళ్ళలో, నడవడికలో క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయే నటన కనబరిచింది.
అందుకోసమే ఇప్పుడు బడా బడా నిర్మాతలు ఈ అమ్మడి చుట్టే తిరుగుతున్నారు. అయితే కథ, తన క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తానని కండీషన్ పెట్టడంతో, కెరీర్ మొదట్లోనే ఇలా కండీషన్లు ఏంటని నిర్మాతలు విస్తు పోతున్నారు. మరి ఇదే విధంగా నివేద వరస ఉంటే, కెరీర్ మొగ్గలోనే ఆగిపొద్దా, లేదా ముందుకు సాగుతుందా అనేది చూడాలి.