
హీరోగా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఇతర సీనియర్ హీరోలతో పోలిస్తే చాలా ఆలస్యంగా తెలుసుకున్న రాజశేఖర్, ఎట్టకేలకు విలన్ బాట పట్టాడు. లెజెండ్ సినిమాలో విలన్ రోల్ ముందుగా రాజశేఖర్ గడప తాకినా, తాను కాదన్న తర్వాతే జగపతిబాబుని వరించింది, ఆ తర్వాత జగపతి ఏ రేంజిలో బిజీ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
జగపతి బాబు కాస్త జగ్గు భాయ్ గా మారడంతో తాను కూడా అదే పంధా ఎంచుకోవాలని ప్రస్తుతం గోపిచంద్ సినిమాలో విలన్ రోల్ అంగీకరించారు. విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో, తన రెండో ఇన్నింగ్స్ కి బాగా ఉపయోగపడొచ్చు అనే అంచనాతో, రాజశేఖర్ ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. శ్రీ వాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని, దర్శకుడే వేదాశ్వ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు.
ఈ కొత్త బాట రాజశేఖరుడికి బాగా అచ్చొచ్చి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే తన బిరుదుని మరో సారి స్థిరంగా నిలబెట్టుకుంటాడని ఆశిద్దాం.