సోనియాకు మళ్ళీ అనారోగ్యం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మళ్ళీ అస్వస్థకు గురయ్యారు. ఆమె డిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఉదర సంబందమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి చైర్మన్ డిఎస్ రానా తెలిపారు. 

సోనియా గాంధీ ఇదివరకు కూడా రెండుమూడుసార్లు అనారోగ్యంతో అదే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొన్నారు. గతకొంత కాలంగా అఆమే ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఈసారి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనుకొన్నారు. కానీ మళ్ళీ హటాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఆమె తరచూ అనారోగ్యం పాలవుతున్న కారణంగా త్వరలోనే రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.