ఈరోజు రాత్రి ఎన్టీఆర్-నీల్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

జూ.ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. గురువారం రాత్రి 7.56 గంటలకు ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల కాబోతోంది.. అని ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్న జీరో ఎయిట్ గ్రాఫిక్స్ ప్రకటించింది. ఈ విషయం తెలియజేస్తూ పొగ రూపంలో ఉన్న డ్రాగన్-కేవలం కళ్ళు మాత్రమే కనపడేలా ముసుగు ధరించిన జూ.ఎన్టీఆర్‌ పోస్టర్‌ని సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది.    

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కాబోతోంది.