
పెద్ద సినిమాలకు నిర్మాతకో, హీరోకో కథ చెప్పడానికి దర్శకుడు కలిసినప్పటి నుంచే ఆ సినిమా గురించి కబుర్లు మొదలైపోతాయి. కానీ కొన్ని చిన్న సినిమాలకు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టారో ఎప్పుడు షూటింగ్ ముగించి గుమ్మడికాయ కొట్టారో కూడా తెలీదు. అంత నిశబ్దంగా, వేగంగా షూటింగ్‌లు పూర్తయిపోతుంటాయి.
అటువంటిదే జెట్లీ కూడా. రితేష్ రానా స్వీయ దర్శకత్వంలో రితేష్, సత్య, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు నటించిన జెట్లీ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అదీ మామూలుగా లేదు.
కమెడియన్లు నడిపిస్తున్న ప్లేన్ హైజాక్ అయితే వారి కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోలేము కూడా. దానిని ట్రైలర్‌లో చూడొచ్చు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నటన: రితేష్ రానా, సంగీతం: కాల భైరవ, కెమెరా: సురేష్ సారంగం, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, స్టంట్స్: వింగ్ చున్ అంజి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత పెడమల్లు కలిసి నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కాబోతోంది.