
టాలీవుడ్-బాలీవుడ్ మద్య ఒకప్పుడు చాలా దూరం ఉండేది. కానీ ఇప్పుడా దూరం బాగా తగ్గిపోయింది. బాలీవుడ్ అగ్ర నటీనటులు తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. తెలుగు దర్శకులు బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా వంశీ పైడిపల్లి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాకి దర్శకత్వం వహిస్తుంటే, దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మొట్ట మొదటిసారిగా సల్మాన్ ఖాన్-నయనతార జంటగా నటిస్తుండటం మరో విశేషం.
మొన్న ముంబయిలో లాంచనంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ సినిమా కోసం ముంబయి సమీపంలోని గోరేగావ్ వద్ద భారీ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిభ్రవరిలో ఈద్ పండుగ రోజున ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Dil, Dimag, Jigar se from this April with @directorvamshi and #DilRaju #Shirish @SVC_official @kuldeeprathor9 #RafiKazi pic.twitter.com/RuK0KWq2HU
— Salman Khan (@BeingSalmanKhan) March 30, 2026