
దాదాపు నాలుగేళ్ళ విరామం తర్వాత ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమా చేయబోతోంది. ఆ సినిమా పేరు ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రేమ-గౌరవం-రాజకీయాలు ఈ సినిమా కథ నేపధ్యమని పోస్టర్లోనే చెప్పేశారు. ఈసినిమాకి సంగీతం మణిశర్మ, కెమెరా: ఆర్. మధి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేయబోతున్నారు.
కృష్ణ చైతన్య దర్శకత్వం సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
గుండె జారి గల్లంతయిందే, చిన్నదానా నీ కోసం వంటి సూపర్ హిట్ పాటలు వ్రాసిన కృష్ణ చైతన్య ఆ తర్వాత ‘రౌడీ ఫెలో’తో దర్శకుడుగా మారి చల్ మోహన్ రంగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలకు దర్శకత్వం చేశారు. ఇప్పుడు పవర్ ఫుల్ స్టోరీతో ఈ పవర్ పేట సినిమాతో మరోసారి తన ప్రతిభ నిరూపించుకోబోతున్నారు.