హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీలో ముసలం!

ఇటీవల మొయినాబాద్‌ డ్రగ్స్ పార్టీలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండడ్‌గా ఈగిల్ టీమ్‌కి దొరికిపోవడంతో బీఆర్ఎస్‌ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వం దీనిపై సిట్‌ ఏర్పాటు చేసి మరింత లోతుగా విచారణ జరిపిస్తుండటంతో బీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని కొత్త సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

ఇలాంటి సమయంలో హుజురాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు నిన్న రహస్యంగా సమావేశమవడం ఆయనకీ, పార్టీని కలవరపరిచేదే! ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుతో విసుగెత్తిపోవడం వల్లనే ఆయన అనుచరులు రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు నిజంగా ఇందుకే సమావేశమై ఉంటే హుజురాబాద్‌లో బీఆర్ఎస్‌ పార్టీ బలహీనపడుతుంది.

video source: Big TV Breaking News