తెలంగాణ బడ్జెట్‌: రూ.3,24,234 కోట్లు!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో2026-27 సంవత్సరాలకుగాను బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 

రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం విలువ రూ. 3,24,234 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406కోట్లు, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు. 

దీనిలో శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.. 

విద్యాశాఖ: రూ.26,674 కోట్లు

వ్యవసాయ శాఖ: రూ. 23,179 కోట్లు

విద్యుత్ శాఖ : రూ. 21,285 కోట్లు

వైద్య శాఖ : రూ. 13,679 కోట్లు

బీసీ సంక్షేమం : రూ.12,511 కోట్లు

ఎస్సీ సంక్షేమం: రూ.11,784కోట్లు

ఎస్టీ సంక్షేమం: రూ. 7,934 కోట్లు 

పౌరసరఫరాల శాఖ : రూ. 7,366 కోట్లు

మైనార్టీ సంక్షేమం : రూ.3,769 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ : రూ.3,143 కోట్లు

పశు సంవర్ధక శాఖ : రూ.1,529 కోట్లు

పర్యాటక శాఖ : రూ. 1,224 కోట్లు

కార్మిక శాఖ : రూ. 998 కోట్లు.