డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి పట్టుబడితే బిజేపి స్పందించదేమి?

ఇటీవల మొయినాబాద్ ఫామ్‌హౌసులో బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీ టీడీపి ఎంపీ పుట్టా మహేష్ తదితరులు ఈగిల్ టీమ్‌కు రెడ్ హ్యాండడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయగా అప్పుడే అది నిందితుల విచారణ చేపట్టింది కూడా. “ఇంత జరుగుతున్నా తెలంగాణలో బిజేపి నేతలు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఎందుకు స్పందించడం లేదు?” అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. 

శనివారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోంది. దాని కోసమే ప్రత్యేకంగా ఈగిల్ టీమ్‌ ఏర్పాటు చేసింది. అది బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీ టీడీపి ఎంపీ పుట్టా మహేష్ తదితరులను రెడ్ హ్యాండడ్‌గా పట్టుకొని విచారిస్తుంటే రాష్ట్ర బిజేపి నేతలు కనీసం స్పందించలేదు.

బీఆర్ఎస్‌-బిజేపిల మద్య రహస్య అనుబంధం ఉన్నందునే వారు స్పందించడం లేదు. కాదంటే ఇప్పటికైనా స్పందించాలి. మాదక ద్రవ్యాలపై మీ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలి,” అని మహేష్ కుమార్‌ గౌడ్‌ అన్నారు.