2.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్స్ గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారిని రిటర్నింగ్ అధికారులు అనుమతించారు. నేడు చివరి రోజు కావడంతో చాలా భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. శనివారం నామినేషన్స్ పరిశీలన ఉంటుంది. తర్వాత ఫిభ్రవరి 3వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిభ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఫిభ్రవరి 13న ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఇవి రాజకీయ పార్టీలు పాల్గొనే ఎన్నికలు. కానీ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ కాదు. కనుక ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై జాగృతి సభ్యులు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే జనసేన కూడా తనకు బలమున్న స్థానాలలో అభ్యర్ధులను బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది.
రేపు నామినేషన్స్ పరిశీలన తర్వాత ఏయే పార్టీ తరపున ఎంతమంది ఏయే ప్రాంతాలలో పోటీ చేస్తున్నారో స్పష్టత వస్తుంది.