39.jpg)
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ అధికారుల నుంచి నోటీస్ అందుకున్న సంగతి తెలిసిందే. నోటీస్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ పరిధిలో అయన కోరుకున్నచోట విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 65 ఏళ్ళు దాటిన వారికి ఈ సౌలభ్యం ఉంటుంది కనుక కేసీఆర్‌కి ఈ అవకాశం ఇచ్చారు.
కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నందున విచారణకు కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. అలాగే ఎర్రవల్లి ఫామ్‌హౌసులో తనను విచారించాలని కోరారు. కానీ ఈ రెండు అభ్యర్ధనలను సిట్ తిరస్కరించినట్లు సమాచారం.
కనుక నేడు కేసీఆర్ విచారణ జరుగుతుందా లేదా? ఒకవేళ జరిగితే బంజారా హిల్స్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవుతారా?అనే విషయం ఇంకా తెలియదు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను ఈ నెల 20,23న సిట్ అధికారులు ప్రశ్నించారు. తర్వాత ఈ నెల 27న బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుని ప్రశ్నించారు. నేడు కేసీఆర్ విచారణకు హాజరవుతారో లేదో మరికొద్ది సేపటిలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.