2.jpg)
బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ ఆ న్యూస్ ఛానల్ స్టూడియోలో నిర్వహించే చర్చా కార్యక్రమాలలో పాల్గొనబోరని సోషల్ మీడియాలో ఓ ప్రకటన జారీ చేసింది.
అలాగే రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాలలోకి ఆ పత్రిక, న్యూస్ ఛానల్ విలేఖరులు ఎవరినీ అనుమతించబోమని ప్రకటించింది. తమ ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావుని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి ఆ ఛానల్ ప్రతినిధి వెంకట కృష్ణ అవమానించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆ మీడియా రాష్ట్రం పట్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ పట్ల విద్వేషపూరితంగానే తప్పుడు రాతలు రాస్తుండేదని దానిలో పేర్కొంది. కనుక పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఆంధ్రజ్యోతిని తమ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన లేఖ ఇదే...