
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుని ఉద్దేశ్యించి ‘గుంటనక్క’ అని పదేపదే ఎద్దేవా చేస్తున్నారు. ఆమె వలన ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతున్నా స్పందించడం లేదు. కనీసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా ఆ పార్టీ నేతలెవరూ స్పందించడం లేదు. కనుక కల్వకుంట్ల కవిత వార్ వన్ సైడ్ అన్నట్లే సాగుతోంది.
ఈరోజు ఆమె తన తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణిలో నైనీ కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డికి దక్కేలా చేయాలని గుంటనక్క చాలా ప్రయత్నిస్తోంది. మేఘా కృష్ణారెడ్డి తిమింగలం కాగా సృజన్ రెడ్డి చాలా చిన్న చేప.
గుంట నక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అవసరమా? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నైనీ టెండర్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ లేఖ వ్రాస్తే జరిపిస్తామని చెపుతున్నప్పుడు ఎందుకు రాయడం లేదు? గుంటనక్క ఎంత చెప్తే అంత అన్నట్లుంది కేటీఆర్ తీరు,” అని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు.
తెలంగాణ జాగృతి వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తుంది. కనుక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ పార్టీని విడిచి మా పార్టీలో చేరితే నేషనల్ కన్వీనర్ వంటి మంచి పదవి ఇస్తానని కల్వకుంట్ల కవిత ఆఫర్ ఇచ్చారు.