
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు ఏడు గంటల సేపు ప్రశ్నించారు. తర్వాత అయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసు ఓ ట్రాష్!
అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడిగారు. రేవంత్ రెడ్డి చేస్తున్నారో... సజ్జనార్ చేస్తున్నారో... తెలీదు కానీ ప్రతీ అర్ధగంటకోసారి ఫోన్లు వస్తుండేవి. బయట నుంచి పోలీసులు సైగ చేయగానే ముగ్గురు అధికారులు బయటకు వెళ్ళిపోయేవారు. బయట గంటసేపు ఫోన్లో మాట్లాడుకున్న వచ్చి మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతుండేవారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ వద్ద ఒక్క ఆధారం కూడా లేదని నాకు అర్దమైంది,” అని అన్నారు.
కానీ హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్ సోషల్ మీడియాలో నిన్న రాత్రి ఓ పోస్ట్ పెట్టారు. క్రైం నం:243/2024 (ఫోన్ ట్యాపింగ్ కేసు)లో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది.
ఈ కేసులోనే హరీష్ రావుని పిలిచి ప్రశ్నించడం జరిగింది,” అంటూ ఈ కేసులో అయన విచారణకు సంబంధించి పూర్తి వివరాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. కనుక ఈ కేసు విషయంలో జరిగే పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
పత్రికా ప్రకటన
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 20, 2026
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ టి. హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి.. ప్రశ్నించడం… https://t.co/HN6nU4iYvX