రేవంత్ సైన్యం ఆసక్తికరమైన ట్వీట్!

సోషల్ మీడియాలో రేవంత్ సైన్యం తెలంగాణ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. దానిలో “నిన్న జరిగిన విచారణలో హరీష్ రావుకు సిట్ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. మీ ఫోన్‌తో పాటు మీ ముఖ్య అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఎప్పుడు ట్యాప్ చేశారో తేదీల వారీగా ఆధారాలు చూపించారు. 2018 ఎన్నికల తర్వాత ప్రణీత్ రావు బృందం ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఎవిడెన్స్‌ను పోలీసులు సమర్పించారు. ఆ తేదీలు, అధికారులు అడిగిన ప్రశ్నలను మాజీ మంత్రి హరీష్ రావు ఓ పేపర్‌పై నోట్స్‌గా రాసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో భాగంగా హరీష్ రావు ముఖ్య అనుచరులైన ఆరుగురికి త్వరలో నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధమవుతోంది,” అంటూ పేర్కొంది. 

దీంతో బాటు ఫోన్ ట్యాపింగ్‌ గురించి బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత విప్రకాష్ రావు వీడియో స్టేట్‌మెంట్ ఒకటి పెట్టారు. దానిలో అయన ఆ ఆర్నెల్ల కాలంలో నేను హరీష్‌ రావుకి ఫోన్ చేస్తే దయచేసి నాకు ఫోన్ చేయకండి. ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. మీ బతుకు కూడా నాలాగ ఆగం అవుతుందని చెప్పేవారు. ఇదే కారణం చేత ఆయన తన ఇంటికి కూడా ఎవరినీ రానిచ్చేవారు కారు,” అంటూ ప్రకాష్ చెప్పిన మాటలు ‘ఫోన్ ట్యాపింగ్‌’కి బీఆర్ఎస్‌ పార్టీలో కూడా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేస్తోంది కదా? కానీ ఈ కేసులో బాధితుడుగా ఉన్న హరీష్‌ రావు ‘ఇదంతా సిల్లీ డ్రామా... ట్రాష్... ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని చెప్పేందుకు సిట్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూ’ తేలికగా కొట్టిపడేయడం విచిత్రంగా ఉంది కదా?