ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌కి నోటీస్ జారీ

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నేడు నోటీస్ జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. 

ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావుని సిట్ అధికారులు బుధవారం సుమారు 7 గంటల సేపు ప్రశ్నించారు. అవసరమైతే మళ్ళీ పిలుస్తామని విచారణకు హాజరుకావాలని ముందే చెప్పి పంపించారు. బీఆర్ఎస్‌ పార్టీలో మూలస్థంభాలు వంటి హరీష్‌ రావు, కేటీఆర్‌లకు నోటీసులు రావడంతో తర్వాత ఎవరి వంతు? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మరికొందరు ముఖ్యనేతల తర్వాత చివరిగా మాజీ సిఎం, బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ని విచారణకు పిలిచే అవకాశం ఉంది.