
త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్స్ ఖరారు చేసి ప్రకటించింది. రాష్ట్రంలో కాలపరిమితి తీరిన జిహెచ్ఎంసితో సహా 10 మున్సిపల్ కార్పోరేషన్లు, 121 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మేయర్, మున్సిపల్ చైర్మన్, చైర్ పర్సన్ పదవులలో మహిళలకు 50శాతం సీట్లు కేటాయించింది. మిగిలినవాటిలో బీసీలకు 38, ఎస్సీ17, ఎస్టీలకు 5 సీట్లు కేటాయించింది.
జిహెచ్ఎంసి మేయర్: మహిళ (జనరల్)
గ్రేటర్ వరంగల్: జనరల్
ఖమ్మం కార్పోరేషన్: మహిళ (జనరల్)
నల్గొండ కార్పోరేషన్: మహిళ (జనరల్)
నిజామాబాద్ కార్పోరేషన్: మహిళ (జనరల్)
మహబూబ్నగర్ కార్పోరేషన్: బీసీ మహిళ
మంచిర్యాల కార్పోరేషన్: బీసీ జనరల్
కరీంనగర్ కార్పోరేషన్: బీసీ జనరల్
రామగుండం కార్పోరేషన్: ఎస్సీ జనరల్
కొత్తగూడెం కార్పోరేషన్: ఎస్టీ జనరల్.