సంబంధిత వార్తలు

మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఈ నెల 11న బాలంరాయి ప్యాలస్‌లో జరిగిన సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, నగరంలో ఎస్సార్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రవికిరణ్ దేవులపల్లి మంగళవారం రాత్రి ఎస్సార్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆయన పిర్యాదు మేరకు పోలీసులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.