సంక్రాంతి టోల్ వద్దు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి లక్షల మంది ఆంధ్రాలో తమ సొంతూర్లకు బయలుదేరుతుంటారు. కనుక హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడువునా వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. 

కనుక జనవరి 9 నుంచి 14 వరకు, మళ్ళీ తిరుగు ప్రయాణంలో 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌-విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించేందుకు ప్రజలను అనుమతించాలని కోరుతూ తెలంగాణ ఆర్అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ వ్రాశారు.

దీనిపై కేంద్రమంత్రి ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఇందుకు అనుమతిస్తే ఈసారి హైదరాబాద్‌ నుంచి  సంక్రాంతి పండుగకు సొంతూర్లు వెళ్ళేవారు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా దూసుకుపోవచ్చు.