డెప్యూటీ ఫ్లోర్ లీడర్స్... అంటే కేసీఆర్‌ శాసనసభకు రానట్లేనా?

బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ శాసనసభ, మండలికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. శాసనసభకు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డిలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. శాసనసభ మండలికి ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.

 ప్రతీ పార్టీలో డిప్యూటీ ఫ్లోర్ లీదర్లుంటారు. కనుక బీఆర్ఎస్‌ పార్టీలో తాజా నియామకాలు కూడా అటువంటివే అనుకోవచ్చు. కానీ ఇకపై కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు హాజరవుతారన్నట్లు బీఆర్ఎస్‌ పార్టీ చెప్పుకున్నప్పటికీ అయన మొదటి రోజు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారు. కనుక ఆయనకు శాసనసభ సమావేశాలకు వచ్చే ఉద్దేశ్యం లేదు కనుకనే ఈ తాజా నియామకాలు చేపట్టారా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.