
తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసిలో కొత్తగా 6 జోన్లు, 30 సర్కిల్స్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఉన్నాయి.
ఈ ప్రాంతాలలో త్వరలోనే కొత్త జోనల్ కార్యాలయాల ఏర్పాటుకి సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న వార్డు ఆఫీసులలోనే కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. జనవరి రెండో వారంలోగా వీటి ఏర్పాట్లు పూర్తిచేసి అక్కడి నుంచే కార్యకలాపాలు జరుగుతాయి.
జిహెచ్ఎంసి పరిధిలో వార్డుల డీలిమిటేషన్ కోసం కూడా ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం వార్డుల సంఖ్య 300కి పెరిగాయి.
త్వరలో జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కనుక ముందుగానే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది.