బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రావాలని, అలాగే డిసెంబర్ 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చి పెద్దరికం, గౌరవం నిలుపుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ స్పందిస్తూ, “తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్‌గారు రేవంత్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదు. గౌరవమర్యాదల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకప్పుడు ఇదే నోటితో సోనియా గాంధీని ‘బలి దేవత’ అని విమర్శించి, ఇప్పుడు పదవీ అధికారం కాపాడుకునేందుకు ఆమెను పొగుడుతున్నారు.
తెలంగాణ ప్రదాత అనే గౌరవం కూడా లేకుండా కేసీఆర్ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ మళ్ళీ మాకు గౌరవ మర్యాదల గురించి పాఠాలు చెపుతారా?ముందు రేవంత్ రెడ్డి మర్యాదగా నడుచుకోవడం నేర్చుకొని, కేసీఆర్‌ని గౌరవిస్తే మేము కూడా రేవంత్ రెడ్డిని ఆయన ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాము.
ఇలాగే నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే మేము కూడా ఒకటికి పడి మాటలతో జవాబు చెప్పగలము. మర్యాద అనేది అడ్డుకుంటే రాదు. సంపాదించుకోవాలి. అది కేసీఆర్ వద్ద పుష్కలంగా ఉంది కనుక రేవంత్ రెడ్డి దగ్గర కేసీఆర్ పాఠాలు నేర్చుకోవలసిన అవసరమే లేదు,” అని అన్నారు.
(video courtecy: News Line Telugu)