ఏపీ కొత్త మంత్రివర్గం ఇదే

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నేడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో 11 మంది పాతవారీ కొనసాగిస్తూ కొత్తగా 14 మందిని మంత్రులుగా తీసుకొన్నారు. ఈరోజు ఉదయం 11.31 గంటలకు అమరావతిలో సచివాలయం వద్ద గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్ 25 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. 

జగన్ క్యాబినెట్‌లో మళ్ళీ అవకాశం పొందిన పాత మంత్రులు వీరే: బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, సిహెచ్ వేణుగోపాల కృష్ణ, నారాయణ స్వామి, పి.విశ్వరూప్, జి.జయరాం, టి.వనిత, ఎస్.అప్పలరాజు. 

కొత్తగా మంత్రి పదవి చేపట్టబోతున్నవారు: ఆర్‌కె. రోజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, దాడిశెట్టి రాజా, జి.అమర్ నాథ్, కె.గోవర్ధన్, వి.రజని, ఉషశ్రీచరణ్, ఎం.నాగార్జున, ముత్యాల నాయుడు, కె.నాగేశ్వరరావు, కె.సత్యనారాయణ.