
మంత్రి కొండా సురేఖకు పరువు నష్టం కేసులో ఉపశమనం కల్పించారు అక్కినేని నాగార్జున. ఆమె తమ కుటుంబంపై చేసిన చెప్పుకొని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పినందున పరువు నష్టం కేసుని ఉప సంహరించుకున్నారు. దీంతో ఆమెకు వంద కోట్లు కేసు నుంచి బయటపడగలిగారు. నాగార్జున కేసు ఉపసంహరించుకోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసుని మూసివేస్తున్నట్లు ప్రకటించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు చేసే క్రమంలో మద్యలో అక్కినేని నాగార్జున కుటుంబం ప్రస్తావన చేయడంతో ఈ సమస్య మొదలైంది. కానీ చివరికి ఆయన కేసు ఉపసంహరించుకోవడంతో కధ సుఖాంతం అయ్యింది.