
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిన్న నల్గొండ పట్టణంలో పర్యటించారు. కనుక తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆమెకు స్వాగతం పట్టణం అంతా ఆమె ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేశారంటూ మున్సిపాలిటీ సిబ్బంది వాటన్నిటినీ పీకేసి పట్టుకుపోయారు.
దీనిపై కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏదో పెద్ద మంత్రి అనుకున్నాను కానీ మా పిల్లలు ఏర్పాటు చేసిన నా ఫ్లెక్సీలు తీయించేస్తారనుకోలేదు. మంత్రిగా ఉన్న ఆయనకు ఇంత ఓర్వలేని తనం ఎందుకు?ఎవరి పార్టీకి వాళ్ళు చెప్పుకుంటారు కదా? అలాగే మా జాగృతి చెప్పుకుంటే మీకెందుకు అభ్యంతరం?” అని ప్రశ్నించారు.