హైదరాబాద్‌ చేరుకొన్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను రప్పించేందుకు ఈ నెల 18న అమెరికా వెళ్ళిన ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ చేరుకొన్నారు. కేటీఆర్‌ 12 రోజుల అమెరికా పర్యటనలో వివిద రాష్ట్రాలలో పర్యటించి అనేక కంపెనీల ప్రతినిధులు,  సీఈవోలతో సమావేశమయ్యి హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పించారు. న్యూయార్క్‌లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ.1,750 కోట్లు, ఫార్మా కోపియా రూ.1,525 కోట్లు, న్యూజెర్సీలోని స్లేబ్యాక్ ఫార్మా రూ.150 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు అంగీకరించాయి. మంత్రి కేటీఆర్‌ 12 రోజుల పర్యటనలో రాష్ట్రానికి దాదాపు రూ.8,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించగలిగారు. ఇవి ఆయన ప్రతిభకు, తెలంగాణ ప్రభుత్వం పనితీరుకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.