2.jpg)
టిఆర్ఎస్, బిజెపిలు రెండూ ధాన్యం కొనుగోలు విషయంలో నైతిక బాధ్యత విస్మరించి రాజకీయాలు చేసుకొంటూ తెలంగాణ రైతులను క్షోభ పెడుతున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ చేయడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీటుగా స్పందించారు.
రాహుల్ గాంధీగారు మీరు ఎంపీగా ఉన్నారు. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్ళకు సంబందించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ ఎంపీలు ప్రతీరోజు పార్లమెంటు వెల్లోకి వెళ్ళి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వెళ్ళి నిరసన తెలియజేయండి. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి,” అని ఘాటుగా ట్విట్టర్లో బదులిచ్చారు.
.@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe