
సిఎం కేసీఆర్ సకుటుంబ సమేతంగా నేడు యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సిఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన షెడ్యూల్:
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.45 గంటలకు యాదాద్రి చేరుకొంటారు.
ఉదయం 10.50 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ చేరుకొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారి శోభాయత్రలో పాల్గొంటారు. తరువాత మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.00-01.00 గంటల మద్య సిఎం కేసీఆర్ దంపతులు గర్భాలయంలో స్వామివారికి తొలిపూజ చేస్తారు. అనతరం వేదపండితుల ఆశీర్వచనాలు పొంది, స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తారు.
మధ్యాహ్నం 02.00-03.00 గంటలకు ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం కేసీఆర్ సన్మానిస్తారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద యాగశాలలో అందరూ కలిసి భోజనాలు చేస్తారు.
తరువాత సిఎం కేసీఆర్ కుటుంబం హైదరాబాద్కు బయలుదేరుతారు.