పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నేడు టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వారు నిరసనలు తెలియజేశారు. రాష్ట్రంలో నవోదయా విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి 5-6 ఏళ్ళు అవుతున్నా ఆ హామీని నిలుపుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొనారు. అంతకు ముందు లోక్సభలో టిఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభలో టిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై చర్చించేందుకు వాయిదా తీర్మానాలు ఇచ్చారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. pic.twitter.com/Czn3WsrBom
— Namasthe Telangana (@ntdailyonline) March 25, 2022