తెలంగాణ హైకోర్టుకి 10 మంది జడ్జీలు నియామకం

తెలంగాణ హైకోర్టుకి కొత్తగా 10 మంది జడ్జీలు నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మనేని సుధీర్ కుమార్, జువ్వాది శ్రీదేవి, నాట్చరాజు శ్రవణ్ కుమార్‌ వెంకట్, గన్ను అనుపమ చక్రవర్తి, మాటూరి గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్ రెడ్డి, దేవరాజు నాగార్జున హైకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు.  వీరందరూ గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొంటూ హైకోర్టు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి జడ్జీలను నియమించుకొంటోంది. ఆయన కూడా చాలా సానుకూలంగా, చురుకుగా స్పందిస్తూ నిర్ణయాలు తీసుకొంటున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవి చేపట్టిన తరువాత తెలంగాణ హైకోర్టుకు జడ్జీలను నియమించడం ఇది రెండోసారి. ఇటీవలే ఆయన హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిటరీ మీడియా సెంటర్‌కు భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే.