ఎర్రవెల్లిలో మంత్రులతో సిఎం కేసీఆర్ సమావేశం

సిఎం కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో మంత్రులతో సమావేశమవుతున్నారు. దీని గురించి ముందుగా ఎటువంటి సమాచారం లేకపోవడంతో హటాత్తుగా సమావేశం నిర్వహించడానికి కారణం ఏమిటోనని అందరూ కుతూహలంగా ఉన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వివిద శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత రెడ్డిలతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరైనట్లు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత హరీష్‌రావు లేదా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.