హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎక్కడిక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు, రోడ్‌ అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తుండటంతో అనేక ఏళ్ళుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమైన హైదరాబాద్‌ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతున్నాయి. నగరంలో కొత్తగా నిర్మించిన మరో ఫ్లైఓవర్‌, అండర్ పాస్ రోడ్‌ బుదవారం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 

ఎల్బీ నగర్‌ చౌరస్తాలో ఇన్నర్ రింగ్ రోడ్‌ మార్గంలో కుడివైపు నిర్మించిన అండర్ పాస్ రోడ్‌ని, బైరామల్ గూడ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభోత్సవం చేశారు. మంత్రులు మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.  

స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించిన అండర్ పాస్ రోడ్‌కు రూ.9.28 కోట్లు, ఫ్లైఓవర్‌కు రూ.28.64 కోట్లు ఖర్చు చేసింది.