18.jpg)
కర్నాటకలో ఓ కాలేజీలో మొదలైన హిజాబ్ (ముస్లిం మహిళలు తలపై ధరించే వస్త్రం) వివాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ వేడి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకింది. దీనిపై సిఎం కేసీఆర్ నిన్న శాసనసభలో స్పందిస్తూ, “అసలు ప్రజలు ఏ దుస్తులు ధరిస్తే ప్రభుత్వాలకు ఎందుకు?వారి దుస్తులతో ప్రభుత్వాలకు సంబందం ఏమిటి?హిజాబ్ వివాదంపై బిజెపి వ్యవహరిస్తున్న తీరు సరికాదు. మతం పేరుతో ప్రజల మద్య చిచ్చు రగిలించి బిజెపి ఏమి సాధించాలనుకొంటోంది?దీంతో బిజెపి దేశాన్ని విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడేళ్ళ బిజెపి పాలనలో దేశంలో ఏమి పెరిగిందంటే పేదరికం పెరిగింది...మత విద్వేషాలు ఇంకా పెరిగాయి.
ఓపక్క దేశ ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంటే దాని గురించి ఆలోచించకుండా కొత్తగా హిజాబ్ చిచ్చు రగిలించింది. ఈ కార్చిచ్చు యావత్ దేశాన్ని దహించి వేస్తుంది. ఈ మత పిచ్చి కారణంగా దశాబ్ధాలుగా సాధించిన అభివృద్ధి ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కనుక మేధావులు, యువత దీని గురించి లోతుగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని సిఎం కేసీఆర్ అన్నారు.