తుకారాంగేట్ అండర్ పాస్ ప్రారంభం

సికింద్రాబాద్‌ నుంచి లాలాపేట్, మల్కాజిగిరి మౌలాలి, నేరెడ్‌మెట్‌ తదితర ప్రాంతాలకు మద్య గల తుకారాంగేట్ వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్‌ అండర్ బ్రిడ్జికి మంత్రి కేటీఆర్‌ మార్చి 5వ తేదీన ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. 

తుకారాంగేట్ వద్ద రైళ్ళ రాకపోకలను బట్టి ఇంచుమించు ప్రతీ 40-50 నిమిషాలకోసారి రోజుకి 20 నుంచి 26 సార్లు గేట్లు మూస్తుండేవారు. గేటు మూసి రైలు వెళ్ళేక తీసేందుకు కనీసం 20-30 నిమిషాల సమయం పట్టేది. ఆ తరువాత అక్కడ పెరుకుపోయిన వాహనాలు క్లియర్ అయ్యేందుకు మరో 20-30 నిమిషాలు పట్టేది. అవన్నీ వెళ్ళేసరికి మరో రైలు వస్తున్నట్లయితే మళ్ళీ గేట్ పడేది. 

ఈ మార్గం గుండా రోజుకి కనీసం లక్ష వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దాంతో ప్రతీరోజు ఆ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్కులో చిక్కుకొని ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ రోడ్‌ అండర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రావడంతో చాలా ఊరట కలిగింది. ఇప్పుడు రైల్వే గేట్ వద్ద ఆగకుండా వాహనాలు ముందుకు సాగిపోతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ కూడా బాగా తగ్గింది.

దీని నిర్మాణానికి మొత్తం రూ.20.10 కోట్లు ఖర్చు కాగా దానిలో జీహెచ్‌ఎంసీ రూ.15.15 కోట్లు రైల్వేశాఖ రూ.13.95 కోట్లు భరించాయి. 

 సుమారు 50 ఏళ్ళుగా కాగితాలకే పరిమితమైపోయిన తుకారాంగేట్ అండర్ పాస్ నిర్మాణ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాల మీద పూర్తి చేయించింది. మద్యలో కరోనా కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ చివరికి పూర్తి చేయించి ప్రజల కష్టాలు తీర్చింది.