సంబంధిత వార్తలు

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈరోజు ఉదయం మండలి అధికారులు తెలిపారు. ఆయన ఎన్నికైనట్లు ప్రకటించిన తరువాత మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, ప్రశాంత్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనను ఛైర్మన్ సీటు వద్దకు తోడ్కొని తీసుకువెళ్లారు. ఆయన తన కుర్చీలో ఆశీనులైన తరువాత వారందరూ ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.