మొట్ట మొదట పోలీస్ శాఖ నుంచే నోటిఫికేషన్లు

సిఎం కేసీఆర్‌ ప్రకటించిన 80,039 ఉద్యోగాలలో ఒక్క పోలీస్ శాఖలోనే 18,334 పోస్టులున్నాయి. వీటిలో 1,500 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, మిగిలినవన్నీ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలే అని సమాచారం. వీటి భర్తీకి సంబందించి పోలీస్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. కనుక ముందుగా పోలీస్ శాఖలో ఉద్యోగాలకే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం అనుమతి రాగానే ఈ వారంలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకే ఎక్కువ పోటీ ఉంటుంది. కనుక అప్పుడే నిరుద్యోగులు వాటి కోసం సిద్దం అవుతున్నారు. ఈ ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు అన్ని జిల్లాలలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి జిల్లా పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ఆదేశించారు.