
సిఎం కేసీఆర్‌కు ఈ రోజు స్వల్ప అస్వస్థతగా ఉండటంతో యాదాద్రి పర్యటన రద్దు చేసుకొని యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. గత రెండు రోజులుగా సిఎం కేసీఆర్ కాస్త నీరసంగా ఉన్నారని, ఎడమ చెయ్యి కూడా లాగుతున్నట్లు ఉండటంతో జనరల్ చెకప్ చేయించుకొంటున్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు మీడియాకు తెలిపారు. స్వల్ప అస్వస్థత తప్ప సిఎం కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. యశోదా వైద్యులు ఆయనకు ప్రాధమిక పరీక్షలు చేసిన తరువాత 2డి ఈకో, యాంజియోగ్రామ్ చేశారు. అన్ని నార్మల్‌గానే ఉన్నాయని యశోదా వైద్యులు తెలిపారు. ఒక వారం రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించి సిఎం కేసీఆర్‌ను డిశ్చార్జ్ చేశామని తెలిపారు.
సిఎం కేసీఆర్‌కు తోడుగా ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత కూడా యశోదా హాస్పిటల్‌కు వెళ్లారు. ఈవిషయం తెలుసుకొన్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు కూడా హాస్పిటల్ చేరుకొని సిఎం కేసీఆర్‌ను పరామర్శించారు.