సంబంధిత వార్తలు

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసమే ప్రత్యేకంగా 50 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.