.jpg)
ఈరోజు శాసనసభలో మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగం ముగించిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరిగింది. దీనిలో టిఆర్ఎస్ తరపున మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ తరపున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మజ్లీస్ తరపున అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
ఈనెల 15వ తేదీ వరకు ఏడు రోజులపాటు శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 8, 13 తేదీలలో ఉభయసభలకు సెలవు ఉంటుంది. ఈ నెల 9న బడ్జెట్‌పై సాధారణ చర్చ, 10 నుంచి 12 వరకు మూడు రోజులు పద్దులపై చర్చ, 15న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని నిర్ణయించారు.