సంబంధిత వార్తలు
కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసేందుకుగాను సిఎం కేసీఆర్ వివిద రాష్ట్రాలలోలో బిజెపియేతర ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తున్నారు. సిఎం కేసీఆర్ ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి రాంచీ చేరుకొని అక్కడ గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మధ్యాహ్నం ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్తో భేటీ కానున్నారు. సిఎం కేసీఆర్తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు కూడా రాంచీకి వెళ్లారు.