
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారయ్యాయి. ఈరోజు సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన మంత్రుల సమావేశంలో మార్చి 6వ తేదీన మంత్రివర్గ సమావేశం, మార్చి 7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. మార్చి 7వ తేదీన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావు 2022-23 ఆర్ధిక సంవత్సరాలకి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. మార్చి 7న అధికార, ప్రతిపక్షాల సభ్యులతో కూడిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు, ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి.