సంబంధిత వార్తలు

ఉక్రెయిన్‌లో ఉన్నత విద్యలు అభ్యసించేందుకు వెళ్ళి అక్కడ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్దులను స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు ప్రారంభిచింది. ఉక్రెయిన్‌కు పొరుగునే ఉన్న హంగేరీ, రొమేనియా దేశాల ద్వారా విద్యార్దులను భారత్ తీసుకువచ్చేందుకు ఆయా దేశాలతో మాట్లాడుతోంది. కనుక ఉక్రెయిన్‌లో ఆ రెండు దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉంటున్న విద్యార్దులు తాము చెప్పిన వెంటనే చెక్ పాయింట్స్ వద్దకు చేరుకోవాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హంగేరీ, రొమేనియాల నుంచి విమానాలలో భారత్‌కు తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.