47.jpg)
సిఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలాఖరులోగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అయితే ఈసారి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను కలిసేందుకు కాదు...మోడీని, బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యేందుకు వెళ్లబోతున్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతానని శపదం చేసిన సిఎం కేసీఆర్, ఇటీవల ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరత్ పవార్‌తో భేటీ అయ్యి జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే. త్వరలో హైదరాబాద్‌లో బిజెపియేతర ముఖ్యమంత్రులను, పార్టీలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు. బహుశః ఆ ప్రయత్నంలోనే ఢిల్లీకి వెళ్ళి విపక్ష నేతలతో తన ఆలోచనలను పంచుకోవాలనుకొంటున్నారేమో? కానీ ప్రస్తుతం యూపీ ఎన్నికలు జరుగుతున్నందున విపక్ష నేతలు కూడా చాలా బిజీగా ఉన్నారు. కనుక అందుబాటులో ఉన్న పార్టీల నేతలను కలిసి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది.