యూపీలో నాలుగో విడత పోలింగ్ షురూ

యూపీ శాసనసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం మొదలైంది. తొమ్మిది జిల్లాలలో 59 స్థానాలకు ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ జరుగుతున్న9 జిల్లాలు యూపీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే బుందేల్ ఖండ్, అవద్, రోహిల్ ఖండ్‌ ప్రాంతాలలో ఉన్నందున ఈరోజు జరిగే పోలింగ్ చాలా కీలకమైనదిగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ 59 స్థానాలకు మొత్తం 624 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 

యూపీ శాసనసభలో మొత్తం 403 స్థానాలు ఉండగా వాటిలో 172 స్థానాలకు మూడు విడతలలో పోలింగ్‌ ముగిసింది. నేడు మరో 59 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మళ్ళీ ఈనెల 27న 61 స్థానాలకు, మార్చి3న 57 స్థానాలకు, చివరిగా మార్చి 7న 54 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడతాయి.